Top 5 This Week

Related Posts

మరో ఎన్కౌంటర్: ఏడుగురు మావోయిస్టుల మృతి

బీజాపూర్: ఛత్తీస్ గఢ్ అడవుల్లో గురువారం మరో ఎన్కౌంటర్ ఘటన చోటు చేసుకుంది. బీజాపూర్-దంతెవాడ సరిహద్దు అడవుల్లో గురువారం మావోయిస్టులకు, భద్రతా బలగాలకు జరిగిన ఎదురుకాల్పుల ఘటనలో ఏడుగురు నక్సలైట్లు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.

నిన్న.. బుధవారం ఇదే ప్రాంతపు అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్ ఘటనలో ముగ్గురు డీఆర్జీ పోలీస్ జవాన్లతోపాటు 12 మంది నక్సలైట్లు మృతి చెందిన సంగతి తెలిసిందే. తాజాగా గురువారం జరిగిన మరో ఎన్కౌంటర్ ఉదంతంతో మృతి చెందిన నక్సలైట్ల సంఖ్య 19 మందికి చేరుకుంది. కాగా కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు పోలీసు వర్గాలు భావిస్తున్నాయి.

Popular Articles