Top 5 This Week

Related Posts

దావూద్ మృతిపై అనీస్ ఇబ్రహీం స్పందన!

మోస్ట్ వాంటెడ్ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కరోనా సోకి మరణించారనే వార్తలపై అతని సోదరుడు అనీస్ ఇబ్రహీం స్పందించారు. గ్యాంగ్ స్టర్ దావూద్, అతని భార్య మెహజబీన్ కరోనా బారిన పడి కరాచీలోని మిలట్రీ ఆసుపత్రిలో చేరినట్లు వార్తలు వచ్చిన విషయం విదితమే. ఈ నేపథ్యంలోనే దావూద్ మరణించినట్లు కూడా తాజాగా వార్తలు వస్తున్నాయి.

అయితే ఈ వార్తలను దావూద్ సోదరుడు అనీస్ ఇబ్రహీం తోసిపుచ్చాడు. ‘భాయ్’ (దావూద్) బాగానే ఉన్నాడు, షకీల్ కూడా బాగున్నాడు. మా కుటుంబంలో ఎవరికీ కరోనా సోకలేదు. మరెవరూ చికిత్స కోసం ఆసుపత్రిలో చేరలేదు’ అని ఆయన పేర్కొన్నారు. దావూద్ ఇబ్రహీంకు చెందిన ‘డి’ కంపెనీ వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలను అతని సోదరుడైన అనీస్ ఇబ్రహీం చూస్తుంటాడు.

దావూద్ ను, అతని భార్యను కరోనా పాజిటివ్ నివేదికల అనంతరం ఆసుపత్రిలో చేర్చుకున్నట్లు పాకిస్థాన్ ఇంటలిజెన్స్ ఏజెన్సీలు నివేదించిన పరిస్థితుల్లో అనీస్ ఇబ్రహీం ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అనీస్ వాదన అయోమయానికి కారణమైనట్లు జాతీయంగా, అంతర్జాతీయంగా పలు మీడియా సంస్థలు వార్తా కథనాలను ప్రచురించాయి.

Popular Articles