Friday, January 23, 2026

Top 5 This Week

Related Posts

భళా… భోగి మంటల్లో ఆంధ్రప్రదేశ్ ‘సిత్రం’!

పై ఫొటోను జాగ్రత్తగా చూడండి. ఆ..ఏముందీ ఏదో మంట మండుతోంది అని సింపుల్ గా తీసేయకండి. అమరావతి రాజధాని ‘మూడు ముక్కల’ అంశంలో ఆంధ్రప్రదేశ్ లో ఆందోళనలు అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే కదా? నిరసనలు, ఆందోళనలు, అరెస్టులు వంటి అనేక సీన్లతో ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. ఈ నేపథ్యంలోనే సోమవారం రాత్రి కృష్ణా జిల్లా పామర్రులోని ఓ ఇంటి ముందు భోగి మంటలు ‘ఆంధ్రప్రదేశ్’ చిత్ర పటాన్ని తలపించే విధంగా సాక్షాత్కరించడం విశేషం. దిగువన గల ఏపీ మ్యాప్ ను, భోగి మంటల దృశ్యాన్ని మళ్లీ ఓసారి చూడండి. ఇది గ్రాఫిక్ మాయ కాదు. అసలైన ఫొటోగా కెమెరా నిపుణులు తేల్చిన తర్వాతే భోగి మంటల్లో ఆంధ్రప్రదేశ్ ఆవిష్కృతపు దృశ్యాన్ని ts29 పరిగణనలోకి తీసుకుంది.

Popular Articles