Saturday, January 24, 2026

Top 5 This Week

Related Posts

సీఎం, అడ్లూరి నుంచి అజారుద్దీన్ కు శాఖల కేటాయింపు

హైదరాబాద్: తెలంగాణా కేబినెట్ మంత్రిగా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేసిన అజారుద్దీన్ కు శాఖలు కేటాయించారు. మైనార్టీ సంక్షేమం, పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ శాఖలను అజారుద్దీన్ కు కేటాయిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వు జారీ చేసింది. ఈ రెండు శాఖల్లో పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డి వద్ద ఉండగా, మైనార్టీ సంక్షేమ శాఖ మరో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వద్ద ఉన్నాయి.

మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఐదో రోజున అజారుద్దీన్ కు శాఖలు కేటాయించడం గమానార్హం. హోం లేదా మున్సిపల్ శాఖల కోసం అజారుద్దీన్ పట్టుబట్టినట్లు వార్తలు వచ్చాయి. జాతీయ స్థాయిలో పార్టీ నాయకుల వద్ద తనకు గల లాబాయింగ్ ద్వారా అజారుద్దీన్ హోం, మున్సిపల్ శాఖల్లో ఏదో ఒకదానికి కోసం తీవ్రంగా ప్రయత్నించారనేది ఆయా వార్తాల సారాంశం. ఈ రెండు శాఖలను ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్నారు. భిన్న వార్తా కథనాల మధ్య అజారుద్దీన్ కు ఎట్టకేలకు మైనార్టీ, పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ శాఖలను కేటాయించడం విశేషం.

Popular Articles