యూరియా కొరత అంశంపై తెలంగాణా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు రైతులకు బహిరంగ లేఖ రాశారు. ఇతర దేశాల నుంచి యూరియాను దిగుమతి చేయించడంలో కేంద్రం అసమర్థతో వ్యవహరించిందని, ఈ విషయంలో కేంద్రం ఘోర వైఫల్యం చెందిందని తుమ్మల ఆరోపించారు. రాష్ట్రానికి కేటాయింపుల ప్రకారం రావలసిన యూరియాను తెప్పించడానికి ఎంతవరకైనా పోరాడుతామని మంత్రి పేర్కొన్నారు. పాత నిల్వలతో కలుపుకుని ఇప్పటికే 7.32 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు అందించినట్లు మంత్రి తుమ్మల చెప్పారు.
కేంద్రం యూరియా కేటాయింపులు, సరఫరా, స్వదేశీ యూరియా, దిగుమతి వివరాలు, ప్రస్తుత పరిస్థితిపై మంత్రి తుమ్మల రైతులకు రాసిన బహిరంగ లేఖ ప్రతిని దిగువన చూడవచ్చు.