Monday, September 1, 2025

Top 5 This Week

Related Posts

ఫోర్జరీ ష్యూరిటీల కలకలం: ఖమ్మంలో అడ్వకేట్ అరెస్ట్

ఖమ్మం నగర పోలీసులు లతీఫ్ అనే అడ్వకేట్ ను అదుపులోకి తీసుకున్నారు. నేలకొండపల్లి మండలంలో ఇటీవల జరిగిన సంచలన జంట హత్యల కేసులో నిందితులకు బెయిల్ ఇప్పించేందుకు ఫోర్జరీ ష్యూరిటీలను తయారు చేసి న్యాయస్థానంలో సమర్పించాడనే అభియోగంపై అడ్వకేట్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కొణిజర్ల మండలానికి చెందిన సంబంధిత గ్రామ పంచాయతీ కార్యదర్శి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అడ్వకేట్ లతీఫ్ ను పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం.

అయితే ఈ అరెస్టును అక్రమంగా ఖమ్మం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు తొండపు వెంకటేశ్వర్ రావు ఆరోపించారు. బార్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యుడైన లతీఫ్ అరెస్టును ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా ఫోర్జరీ డాక్యుమెంట్ల అంశాన్ని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చర్యను ఉపేక్షించే ప్రసక్తే లేదని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. ఈమేరకు దిగువస్థాయి పోలీసు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం.

Popular Articles