Saturday, January 24, 2026

Top 5 This Week

Related Posts

చలించడానికి మనసుండాలి… సోనూ సూద్ ‘దాతృత్వం’లా !

మన రాజకీయ నాయకులు కొందరు ప్రజలకు చాలా వాగ్ధానాలు చేస్తుంటారు. ఇందులో ఎన్ని నెరవేరుతాయి? మరెన్ని అటకెక్కుతాయి? అనే ప్రస్తావన జోలికి వెళ్లకుండా ఓ సినీ నటుడి మానవత్వం, దాతృత్వం గురించి ఖచ్చితంగా చెప్పుకోవలసిందే. ప్రముఖ నటుడు సోనూ సూద్ తెలుసుగా? పేదలు కష్టాల్లో ఉన్నారంటే ఆయన గుండె ఐస్ ముక్కలా కరిగిపోతూ ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా కేవీ పల్లి మండలం మహల్ రాజపల్లిలో నాగేశ్వరరావు అనే రైతు తన పొలంలో కూతుళ్లతో నాగలి దున్నిస్తున్న సీన్ చూసి సోనూ సూద్ చలించిపోయారు. నాగేశ్వరరావు కూతుళ్లు కాడెద్దులుగా మారిన వీడియోను చూసి ట్విట్టర్ వేదికగా సోనూ సూద్ స్పందించారు.

ఈ వీడియోను చూసిన సోనూసూద్ గుండె తరుక్కుపోవడంతో వారికి ఎడ్లు కొనిస్తానని తొలుత ట్వీట్ చేశారు. అయితే ఆ కాసేపటికే… ఎడ్లు కాదు ట్రాక్టర్ కు రైతు నాగేశ్వరరావు అర్హుడంటూ వాగ్డానం చేశారు. వాగ్డానం ఇవ్వడమే కాదు దాన్ని అమలు చేసి చూపించారు. ట్రాక్టర్ ను సోనూసూద్ ఆర్డర్ చేయడంతో షోరూం నిర్వాహకులు ఈ సాయంత్రం రైతు నాగేశ్వరరావుకు దాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా సోనూసూద్ స్పందిస్తూ కుమార్తెల చదువుపై దృష్టి సారించాలని రైతు నాగేశ్వరరావును కోరాగా, సోనూ సూద్ మనసు చాలా గొప్పదని నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. రైతు నాగేశ్వరరావు కుటుంబం సోనూసూద్ కు ఈ సందర్భంగా మనఃస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపింది.

Popular Articles