Top 5 This Week

Related Posts

షర్మిల కాన్వాయ్ లో ప్రమాదాలు

వైఎస్ షర్మిల కాన్వాయ్ లలో రెండు వేర్వేరు చోట్ల ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఖమ్మం నగరంలో శుక్రవారం సాయంత్రం నిర్వహించతలపెట్టిన సంకల్పసభ కోసం షర్మిల భారీ కాన్వాయ్ తో హైదరాబాద్ నుంచి బయలుదేరారు. అయితే ఎల్బీనగర్ దాటాక కాన్వాయ్ లోని కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో సుమారు అయిదు కార్లు భారీగా ధ్వంసమయ్యాయి. అదేవిధంగా జడ్చర్ల నుంచి షర్మిల సభ కోసం ఖమ్మం బయలుదేరిన మరో కార్ల కాన్వాయ్ లో కూడా ప్రమాదం జరిగినట్లు సమాచారం. షాద్ నగర్ వద్ద జరిగిన ఈ ఘటనలో కూడా అయిదారు కార్ల వరకు పెద్దఎత్తున దెబ్బతిన్నాయి. అదృష్టవశాత్తు ఆయా ప్రమాదాల్లో కార్లలో ప్రయాణిస్తున్న మనుషులెవరూ గాయపడలేదు.

ఫొటో: కాన్వాయ్ లో ధ్వంసమైన ఓ కారు

Popular Articles