ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్ కు ఏసీబీ నుంచి మళ్లీ పిలుపొచ్చింది. గురువారం ఉదయం 11.30 గంటలకు తమ ముందు విచారణకు హాజరు కావాలంటూ ఏసీబీ అధికారులు మరోసారి నోటీసు ఇచ్చారు. ఫార్ములా ఈరేస్ కేసులో విచారణ కోసం రావాలంటూ ఆయనకు ఏసీబీ మళ్లీ నోటీసులు ఇచ్చింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా అర్వింద్ కుమార్ కు నోటీసులు జారీ చేసింది. గత కొన్ని రోజులుగా విదేశాల్లో ఉన్న అర్వింద్ కుమార్ మూడు రోజుల క్రితమే.. గత నెల 30వ తేదీన తిరిగి హైదరాబాద్ వచ్చారు.
