బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఏసీబీ నుంచి మరోసారి పిలుపు వచ్చింది. ఈమేరకు ఆయనకు నోటీసులు జారీ చేస్తూ ఈనెల 28వ తేదీన విచారణకు రావాలని ఏసీబీ కోరింది. బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో నిర్వహించిన ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ కు ఏసీబీ మరోసారి నోటీసులివ్వడం విశేషం. ఈనెల 28వ తేదీనే కేటీఆర్ అమెరికా, యూకే పర్యటనకు బయలుదేరుతున్న పరిణామాల్లో ఏసీబీ ఆయనకు నోటీసులు జారీ చేయడం గమనార్హం.
అయితే తాజా నోటీసులపై కేటీఆర్ కూడా స్పందించారు. రాజకీయ వేధింపుల్లో భాగంగా తనకు నోటీసులు ఇచ్చారని, రాజకీయ కక్ష సాధింపులకు సీఎం రేవంత్ రెడ్డి పాల్పడుతున్నారని ఆరోపించారు. తన విదేశీ పర్యటన షెడ్యూల్ ఇప్పటికే ఖరారైనందున తిరిగి వచ్చిన తర్వాత ఏసీబీ విచారణకు హాజరవుతానని కేటీఆర్ పేర్కొన్నారు. నోటీసులపై ఏసీబీకి లిఖిత పూర్వక సమాచారం ఇచ్చినట్లు కూడా చెప్పారు. ఇదిలా ఉండగా కేటీఆర్ కు ఏసీబీ నోటీసుల జారీపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. ఇందుకు సంబంధించి ఆమె ఎక్స్ వేదికగా చేసిన ట్వీట్ ను దిగువన చూడవచ్చు.
