Saturday, January 24, 2026

Top 5 This Week

Related Posts

తెలంగాణా చెక్ పోస్టులపై ఏసీబీ దాడులు, కరెన్సీ కట్టలు లభ్యం

ఖమ్మం: తెలంగాణా రవాణా శాఖ ఎత్తివేసి పలు చెక్ పోస్టులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దాడులు నిర్వహిస్తోంది. ముఖ్యంగా రాష్ట్ర సరిహద్దుల్లో గల చెక్ పోస్టులపై గత అర్ధరాత్రి నుంచి ఏసీబీ దాడులు నిర్వహిస్తూ, సోదాలు చేస్తోంది. ఖమ్మం జిల్లా ముత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట, పాల్వంచ, కామారెడ్డి జిల్లా సలాబత్‌పూర్‌, సంగారెడ్డి జిల్లా చిరాగ్‌పల్లి చెక్ పోస్టుల్లో సోదాలు కొనసాగుతున్నాయి.

రవాణా శాఖ గతంలో నిర్వహించిన ఈ చెక్‌పోస్టుల్లో భారీ ఎత్తున నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. పట్టుబడ్డ నగదులో లెక్కల్లో లేని మొత్తం లభ్యమైనట్లు తెలుస్తోంది. ప్రభుత్వం చెక్ పోస్టులు ఎత్తివేసినప్పటికీ, ‘అలవాటు’ ప్రకారం ఆయా కేంద్రాల్లోని పలు చోట్ల వాహనాల నుంచి ప్రైవేట్‌ సిబ్బంది అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ ఈ దాడులు నిర్వహిస్తోంది. పూర్తి వివరాలను ఏసీబీ అధికారికంగా ఇంకా వెల్లడించలేదు.

Popular Articles