షటిల్ కోర్టులో ఆడుతూనే గుండెపోటుకు గురై 25 ఏళ్ల యువకుడు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన నాగోల్ స్టేడియంలో చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లా తల్లాడ మాజీ ఉప సర్పంచ్ గుండ్ల వెంకటేశ్వర్లు కుమారుడు రాకేష్(25) హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే నాగోల్ షటిల్ కోర్టులో షటిల్ ఆడుతూనే రాకేష్ ఉన్నట్టుండి కుప్పకూలాడు. దీంతో సహచరులు అతన్ని కాపాడేందుకు చికిత్స కోసం ఆసుపత్రికి తరలించగా, రాకేష్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

