అది తమిళనాడులోని పులుల అభయారణ్యం.. అన్నామలై అభయారణ్యపు అడవుల్లో వెలుగులు వెదజల్లుతూ కనిపిస్తున్న ఈ దృశ్యం ట్రిక్ ఫొటోగ్రఫీ కాదు.. కంప్యూటర్ గ్రాఫిక్ అంతకన్నా కాదు.. ఏఐ క్రియేటివిటీ అసలే కాదు.. మరేమిటీ.. అనుకుంటున్నారా? లక్షలాది మిణుగురు పురుగులు వెదజల్లిన వెలుగుల అద్భుత దృశ్యమిది. అభయారణ్యంలో అర్ధరాత్రి వేళ రెండు చెట్లు ఇలా వెలుగులతో మెరుస్తున్న దృశ్యాలు కనిపించాయి. చెట్లపై లక్షలాది మిణుగురు పురుగులు వాలుతూ, ఎగురుతూ విరజిమ్మిన వెలుగులకు సంబంధించిన రెండు ఫొటోలను తమిళనాడు అటవీ, పర్యావరణ శాఖ అదనపు చీఫ్ సెక్రటరీ సుప్రియా సాహు తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.


