Wednesday, March 4, 2026

Top 5 This Week

Related Posts

తీవ్ర వివాదంలో తెలుగు మీడియా అధిపతి!

హైదరాబాద్: తెలుగు మీడియా అధిపతి ఒకరు తీవ్ర వివాదాస్పద ప్రచారాన్ని ఎదుర్కుంటున్నారు. ఎలక్ట్రానిక్ మీడియాలోని ఛానల్ అధిపతి ఒకరు ఓ మహిళతో సాన్నిహిత్యంగా ఉన్నటువంటి ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఓ అపార్ట్మెంట్ లో, మరో అంతర్జాతీయ ఎయిర్ పోర్టు వంటి వేర్వేరు వంటి పలు ప్రదేశాల్లో, ఇతర రాష్ట్రాల్లోనూ సదరు మీడియా అధిపతి ఆ మహిళతో చెట్టపట్టాల్ వేసుకుని తిరిగిన ఫొటోలు, సన్నిహితంగా ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతూ హాట్ టాపిక్ గా మారాయి.

ఇదే దశలో తమ అధిపతి అంటే ఏమనుకుంటున్నారు? అంటూ అతని ఛానల్ లో పనిచేస్తున్న యాంకర్లు ఒకరిద్దరు వేరే సందర్భాల్లో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలకు ఈ ఫొటోలను, వీడియోలను జత చేస్తూ నెటిజన్లు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. కాగా ఆ మీడియా అధిపతి ఓ మహిళతో సన్నిహితంగా ఉన్న వీడియోలను, ఫొటోలను మరో మీడియా సంస్థ యజమాని బహిర్గతం చేశారనే ప్రచారం కూడా జరుగుతుండడం గమనార్హం. చూడాలి ఈ ప్రచారపు పరిణామాలు ఎటుదారి తీస్తాయో!

Popular Articles