Thursday, September 4, 2025

Top 5 This Week

Related Posts

దేశీయ కరోనా వ్యాక్సిన్లపై కీలక ప్రకటన

మన దేశంలో అభివృద్ధి చెందుతున్న మూడు కరోనా వ్యాక్సిన్లపై నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ కీలక ప్రకటన చేశారు. భారత్ బయోటెక్, సీరం ఇనిస్టిట్యూట్, జైడస్ క్యాడిల్లా సంస్థలు కరోనా వైరస్ నిరోధక వ్యాక్సిన్ల అభివృద్ధిలో నిగమ్నమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీకే సింగ్ చేసిన ప్రకటన ప్రాధాన్యతను సంతరించుకుంది.

మన దేశంలో మొత్తం మూడు వ్యాక్సిన్లు వివిధ దశల్లో ఉన్నట్లు చెప్పారు. ఇందులో ఓ వ్యాక్సిన్ ఒకటి, రెండు రోజుల్లో మూడో దశ పరీక్షలకు చేరుకుంటుందన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ఇచ్చిన భరోసాకు అనుగుణంగానే దేశీయ కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి అడుగులు పడుతున్నాయని ఆయన చెప్పారు.

Popular Articles