మాజీ మంత్రి హరీష్ రావు, మరో ముగ్గురు వ్యక్తులపై పోలీసులకు ఓ ఫిర్యాదు అందింది. బీఆర్ఎస్ కు చెందిన మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు నుంచేగాక, మరో ముగ్గురు వ్యక్తులతో తనకు ప్రాణ హాని ఉన్నట్లు చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి హైదరాబాద్ లోని బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తమకు అందిన ఫిర్యాదు మేరకు బాచుపల్లి పోలీసులు హరీష్ రావుపైనే గాక, సంతోష్ కుమార్, వంశీ, రాములు అనే వ్యక్తులపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో హరీష్ రావును A2గా పేర్కొంటూ ఆయనపై బీఎన్ఎస్ లోని 351(2) రెడ్ విత్ 3(5) సెక్షన్ల కింద బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.