Top 5 This Week

Related Posts

‘దిశ’ పత్రికపై క్రిమినల్ డిఫమేషన్ కేసు, విచారణకు స్వీకరించిన ఖమ్మం కోర్టు

ఖమ్మం: ‘దిశ’ పత్రికపై ఖమ్మం కోర్టులో క్రిమినల్ పరువు నష్టం పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ ను కోర్టు విచారణకు కూడా స్వీకరించింది. తనపై ‘దిశ’ పత్రిక ప్రచురించిన నిరాధార వార్తా కథనాలవల్ల తన పరువుకు భంగం కలిగిందని ఖమ్మం నగరానికి చెందిన డాక్టర్ పులిపాటి ప్రసాద్ న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఈ పిటిషన్ ను దాఖలు చేశారు.

‘దిశ’ పత్రికకు చెందిన మేనేజింగ్ డైరెక్టర్ టి. మోహన్ రావు, ఎడిటర్ డి. మార్కండేయ, స్థానిక విలేకరి దువ్వా సాగర్ లను ప్రతివాదులుగా పేర్కొంటూ పులిపాటి ప్రసాద్ క్రిమినల్ డిఫమేషన్ కింద పిటిషన్ ను దాఖలు చేశారు.

ఈమేరకు ఖమ్మం రెండో అదనపు జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు సిసి నెం. 302/2026 ద్వారా బీఎన్ఎస్ చట్టంలోని 356 (2) సెక్షన్ కింద పులిపాటి ప్రసాద్ దాఖలు చేసిన పిటిషన్ ను విచారణకు స్వీకరించింది. కేసులో తదుపరి విచారణను ఈనెల 25వ తేదీకి వాయిదా వేశారు. కాగా గత ఆగస్టు నెలలో పులిపాటి ప్రసాద్ ‘దిశ’ పత్రికకు లీగల్ నోటీసు జారీ చేసిన సంగతి తెలిసిందే.

Popular Articles