(సమీక్ష ప్రత్యేక కథనం)
బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎంపీ (రాజ్యసభ) వద్దిరాజు రవిచంద్ర పుట్టినరోజు వేడుకలు శనివారం అట్టహాసంగా జరిగాయి. పార్టీకి చెందిన కార్యకర్తలేగాక, వద్దిరాజును వ్యక్తిగతంగా అభిమానించేవారు, మున్నూరుకాపు సంఘం నాయకులు, జర్నలిస్టులు వద్దిరాజు బర్త్ డే వేడుకల్లో పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. గత రాత్రి 12 గంటల నుంచి హైదరాబాద్ లోని వద్దిరాజు నివాసంలో ప్రారంభమైన వేడుకలు ఖమ్మం మీదుగా కొత్తగూడెం నగరం వరకు సాగడం విశేషం. ఈ మూడు నగరాల్లో జరిగిన తన బర్త్ డే వేడుకల్లో పార్టీ కార్యకర్తలను, అభిమానులను కలుసుకుని వద్దిరాజు తన పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం ఆసక్తికరం.

హైదరాబాద్ లోని తన నివాసంలో గత అర్థరాత్రి దాటాక జరిగిన పుట్టినరోజు వేడుకల్లో వద్దిరాజు కుటుంబ సభ్యులతోపాటు మూన్నూరుకాపు సంఘం నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. అదేవిధంగా ఖమ్మంలో జరిగిన వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన వద్దిరాజుకు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు, సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యలతో కలిసి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర చేత కేక్ కట్ చేయించి శాలువాలతో ఘనంగా సన్మానించి, హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఖమ్మంలో వేడుకల అనంతరం కొత్తగూడెంలో జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు చేరుకున్నప్పుడు బీఆర్ఎస్ శ్రేణులు ఎంపీ వద్దిరాజుకు అపూర్వ స్వాగతం పలికారు. కొత్తగూడెం పోస్టాఫీసు సెంటరులో మాజీ మంత్రి వనమా వెంకటేశ్వర రావు, ఆయన కుమారుడు రాఘవ, మునిసిపల్ మాజీ ఛైర్ పర్సన్ కాపు సీతామహాలక్ష్మీ తదితర ప్రముఖులు భారీ క్రేన్ సాయంతో గజమాల వేసి ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత ఊరేగింపుగా పార్టీ జిల్లా కార్యాలయం తెలంగాణ భవన్ చేరుకున్నారు. ఎంపీ రవిచంద్ర చేత భారీ కేక్ కట్ చేయించారు. ఈ సందర్భంగా ఎంపీ వద్దిరాజును పార్టీ నాయకులు శాలువాలతో సన్మానించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
హైదరాబాద్, ఖమ్మం, కొత్తగూడెం నగరాల్లో ఎంపీ వద్దిరాజు బర్త్ డే వేడుకల్లోని ముఖ్య దృశ్యాలను ఇక్కడ చూడవచ్చు.





