Friday, January 23, 2026

Top 5 This Week

Related Posts

ఫోన్ ట్యాపింగ్ కేసు: కేటీఆర్ కు సిట్ నోటీసులు

హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) నోటీసులు జారీ చేసింది. ఈనెల 22వ తేదీన (శుక్రవారం) విచారణకు హాజరు కావాలని సిట్ నుంచి ఆయనకు పిలుపొచ్చింది. ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ లోని సిట్ ఆఫీసుకు విచారణ కోసం రావాలని నోటీసులలో సిట్ అధికారులు పేర్కొన్నారు.

ఇదే కేసులో మాజీ మంత్రి హరీష్ రావును ఈనెల 20వ తేదీన సిట్ అధికారులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఏడు గంటలకుపైగా విచారణ జరిపిన సంగతి తెలిసిందే. హరీష్ రావును మరోసారి విచారణకు పిలుస్తామని కూడా సిట్ అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే విచారణకు హాజరు కావాలని సిట్ అధికారులు తాజాగా కేటీఆర్ కు నోటీసులు జారీ చేయడం గమనార్హం.

సిరిసిల్లలో కేటీఆర్ గురువారం రాత్రి మీడియాతో మాట్లాడినప్పటి చిత్రం

సిట్ నోటీసులపై కేటీఆర్ రియాక్షన్:
ఫోన్ ట్యాపింగ్ కేసులో తనకు సిట్ అధికారులు జారీ చేసిన నోటీసులపై కేటీఆర్ స్పందించారు. ఈమేరకు ఆయన సిరిసిల్లలో మీడియాతో మాట్లాడుతూ, ఇదో లొట్టపీసు కేసు అని, ఇందులో ఏమీ లేదని, హౌలా పనులు బంద్ చేయాలని వ్యాఖ్యానించారు. కేసులో సీఎం రేవంత్ రెడ్డి సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ అనే తరహాలో పోలీసు అధికారులు వ్యవహరిస్తున్నారని చెప్పారు. కార్తీకదీపం సీరియల్ మాదిరిగా ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ జరుగుతోందన్నారు. ఇది ఒడువని, తెగని వ్యవహారంగా పేర్కొన్నారు. ఇదో బక్వాస్ కేసు అని అభివర్ణించారు. తాను ఏ తప్పూ చేయలేదని, ఎవని అయ్యకూ భయపడేది లేదన్నారు. ప్రభుత్వ స్థిరత్వం కోసం పోలీసులు గూఢాచారి వ్యవస్థను నిర్వహించి ప్రభుత్వ పెద్దలకు నివేదిక అందించడం సహజమని, సాధారణమని కేటీఆర్ అన్నారు. ఇది పోలీసులు నిర్వహించే ప్రక్రియగా కేటీఆర్ వ్యాఖ్యానించడం గమనార్హం.

Popular Articles