హైదరాబాద్: ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ N Tv విచారంవ్యక్తం చేసింది. తాను ప్రసారం చేసిన ఓ వార్తా కథనంపై చింతించింది కూడా. ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై తప్పుడు వార్తా కథనాన్ని ప్రసారం చేశారనే అభియోగంపై N Tvపైనేగాక, T News, మరో ఎనిమిది యూ ట్యూబ్ ఛానళ్లపై ఐఏఎస్ అధికారుల సంఘం తరపున ఫిర్యాదు అందిన నేపథ్యంలో హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ వ్యవహారంపై ప్రభుత్వపరంగా చర్యలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగానే ఈ కేసుతోపాటు నారాయణపేట జిల్లాలో నమోదైన మరో కేసులో దర్యాప్తు జరిపేందుకు ప్రభుత్వం ‘సిట్’ను ఏర్పాటు చేసింది. హైదరాబాద్ సీపీ వీజీ సజ్జన్నార్ నేతృత్వంలో ఎనిమిది మంది పోలీసు అధికారులతో సిట్ ఏర్పాటైన నేపథ్యంలో మంగళవారం రాత్రి 9.00 గంటల న్యూస్ బులెటిన్ లో తెలుగు, ఆంగ్లంలో N Tv ఓ ప్రకటనను ప్లే చేసింది. ఈ కథనంపై విచారం వ్యక్తం చేస్తున్నామని, చింతిస్తున్నామని N Tv ఎడిటర్ పేరుతో ప్రసారం చేసిన ప్రకటనను దిగువన చూడవచ్చు.


ఇదీ చదవండి:

