Friday, January 23, 2026

Top 5 This Week

Related Posts

15కల్లా మేడారం జాతర పనులు పూర్తి: డిప్యూటీ సీఎం భట్టి

మేడారం: వనదేవతలు సమ్మక్క-సారలమ్మ జాతర కేవలం గిరిజనుల పండుగ మాత్రమే కాదని, ఈ వేడుక తెలంగాణ గుండె చప్పుడు ఆత్మ గౌరవ ప్రతీకగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మల్లు అభివర్ణించారు. ఆదివారం సాయంత్రం ఆయన మేడారంలో పర్యటించారు. ఈ సందర్భంగా జాతర పనులను మంత్రులు శ్రీధర్ బాబు, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ లతో కలిసి పరిశీలించారు. మేడారం మహాజాతర ఏర్పాట్లపై సమీక్షించిన తర్వాత డిప్యూటీ సీెం మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ, సమ్మక్క సారలమ్మ జాతర విశిష్టతను, సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా శాశ్వత నిర్మాణాలతో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. ఈ జాతర ఏర్పాట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం రూ. 260 కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. ఇందులో జాతర నిర్వహణ కోసం రూ. 150 కోట్లు, శాశ్వత నిర్మాణ పనులకు రూ. 110 కోట్లు వెచ్చిస్తున్నట్టు వివరించారు.

నిధుల ఖర్చు, చేయాల్సిన పనులకు సంబంధించిన అన్ని విషయాలను మేడారంలో సమీక్షించి ఇక్కడికి ఇక్కడే నిర్ణయాలు చేసినట్టు డిప్యూటీ సీఎం మీడియాకు వివరించారు. రెండు రోజుల్లో పనులు పూర్తి కాబోతున్నాయని కూడా తెలిపారు. ఇప్పటికీ జాతర పనులు సగటున 85 శాతం పూర్తి చేశారని, మిగిలిన పనులు 15వ తేదీ వరకు పూర్తి చేయాలని అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఆదేశించారు.

జాతర సందర్భంగా అవసరమైన నిధులు విడుదల చేశామని, పూర్తి చేసిన పనులకు 24 గంటల్లో బిల్లులు మంజూరు చేస్తున్నామని తెలిపారు. గతంలో జాతర నిర్వహణకు రూ. 75 కోట్లు, 100 కోట్లు ఖర్చూ చేస్తే తమ ప్రభుత్వం రూ. 260 కోట్లు ఖర్చు చేస్తున్నదని తెలిపారు. ప్రధానంగా ఆరోగ్య, విద్యుత్ శాఖ అధికారులు జాతర పూర్తి అయ్యేవరకు అప్రమత్తంగా ఉండాలన్నారు. వీరితో పాటు యావత్ శాఖల సిబ్బంది అధికారులు జాతరను సీరియస్ గా తీసుకోవాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు.

Popular Articles