Friday, January 23, 2026

Top 5 This Week

Related Posts

డీటీసీ కిషన్ నాయక్ అరెస్ట్

హైదరాబాద్: మహబూబ్ నగర్ రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ (డీటీసీ) కిషన్ నాయక్ ను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) మంగళవారం అరెస్ట్ చేసింది. అక్రమంగా ఆస్తులను కూడబెట్టారనే అభియోగాలపై హైదరాబాద్ లోని అతని ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. తనిఖీల్లో నిజాంపేట మండలంలో 31 ఎకరాల సేద్యపు భూమిని గుర్తించారు. ఇందులో డ్రాగన్ ఫ్రూట్ తోటలు పెంచుతున్నారు. ఓ పాలీ హౌజ్ ను కూడా నిర్మిస్తున్నారు. అదేవిధంగా నిజామాబాద్ పట్టణంలో మరో 10.00 ఎకరాల వాణిజ్య భూమిని, నిజామాబాద్ లో ఓ అపార్ట్మెంట్ ను, 50 శాతం భాగస్వామ్యం గల ఇంటర్నేషనల్ హోటల్ భవనాన్ని కిషన్ ఆస్తులుగా ఏసీబీ అధికారులు కనుగొన్నారు.

ఏసీబీ అధికారుల సోదాల సందర్భంగా తన నివాసంలో డీటీసీ కిషన్ నాయక్

వీటితోపాటు రూ. 1.37 కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్ ను, కిలో బంగారం, ఒక్కోటి చొప్పున ఇన్నవో క్రిస్టా, హోండా సిటీ కార్లను కనుగొన్నట్లు హైదరాబాద్ నగర ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ వెల్లడించారు. ఆయా ఆస్తులు డాక్యుమెంటరీ విలువ ప్రకారం రూ. 12.50 కోట్లుగా చెబుతూ, బహిరంగ మార్కెట్ లో వాటి విలువ నాలుగైదు రెట్లు అధికంగా ఉంటుందని ఆయన తెలిపారు. కిషన్ నాయక్ గతంలో మేడ్చల్, హైదరాబాద్ లలో రవాణా శాఖ అధికారిగా పనిచేసినట్లు తెలిపారు. కిషన్ నాయక్ ను అరెస్ట్ చేసిన తర్వాత కోర్టులో హాజరుపర్చి, రిమాండ్ కు తరలించినట్లు ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ పేర్కొన్నారు.

కిషన్ నాయక్ ఆస్తుల వివరాలను వెల్లడిస్తున్న హైదరాబాద్ ఏసీబీ డీఎస్పీ శ్రీధర్

Popular Articles