Friday, January 23, 2026

Top 5 This Week

Related Posts

ఐడీపీఎల్ భూములపై సర్కారు సంచలన నిర్ణయం

హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలోని ఐడీపీఎల్ భూములపై తెలంగాణా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే ఆ భూములపై విచారణకు ప్రభుత్వం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. నగరంలోని కూకట్ పల్లిలో గల సర్వే నెం. 376లో రూ. 4,000 కోట్ల విలువైన భూములపై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది.

ఈ భూముల కబ్జాలకు సంబంధించి స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరస్పర ఆరోపణలు చేసుకున్న సంగతి తెలిసిందే. కవిత భర్త అనిల్ పై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు భూకబ్జా ఆరోపణలు కూడా చఏశారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఐడీపీఎల్ భూములపై విజిలెన్స్ విచారణకు ఆదేశాలు జారీ చేయడం గమనార్హం.

Popular Articles