Saturday, January 24, 2026

Top 5 This Week

Related Posts

నకిలీ పట్టాదార్ పాస్ పుస్తకాల ముఠా అరెస్ట్

నకిలీ పట్టాదార్ పాస్ పుస్తకాలను తయారు చేస్తూ పలువురిని మోసం చేస్తున్న ముఠాను ఖమ్మం జిల్లా పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. అరెస్టయిన ఐదుగురి ముఠాలో కూసుమంచి మండలం జక్కేపల్లికి చెందిన కొత్త జీవన్ రెడ్డి (53), గార్ల బయ్యారానికి చెందిన కొండూరి కార్తీక్ (36), పాల్వంచకు చెందిన పారిపత్తి సాయికుశాల్ (28), కొత్తగూడెంలోని లక్ష్మీదేవిపల్లికి చెందిన జక్కపల్లి వరప్రసాద్ (39), భద్రాచలం సమీపంలోని సారపాకకు చెందిన నందమూరి లక్ష్మణ్ రావు (43)లు ఉన్నట్లు కూసుమంచి పోలీసులు ప్రకటించారు. నిందితుల నుంచి రెండు కార్లను, పది నకిలీ పట్టాదార్ పాస్ పుస్తకాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జక్కేపల్లికి చెందిన కొందరు రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాలు ఇప్పిస్తామని డబ్బులు తీసుకుని, నకిలీ పట్టాదార్ పాస్ బుక్కులు తయారు చేసి ఇచ్చారని కూసుమంచి పోలీసులు తెలిపారు. జక్కేపల్లి గ్రామానికి చెందిన కళ్లెం అంజిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి విచారణ చేసినట్లు చెప్పారు. నిందితులను గంగాబండ తండా ఫ్లైఓవర్ దగ్గర మంగళవారం తెల్లవారుజామున అరెస్ట్ చేసి రిమాండుకు తరలించినట్లు కూసుమంచి ఎస్ఐ నాగరాజు వివరించారు.

Popular Articles