బీఆర్ఎస్ పార్టీ ‘కారు’పై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన ట్వీట్ చేశారు. తన ‘ఎక్స్’ ఖాతా వేదికగా ఆయన చేసిన ట్వీట్ లో సంధించిన అనేక ప్రశ్నలు రాజకీయంగా తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. బండి సంజయ్ తన ట్వీట్ లో ఏమంటారంటే..?
‘స్మగ్లింగ్ లగ్జరీ కార్లపై కారు పార్టీ నడుస్తోందా? లగ్జరీ కారు కుంభకోణం కేసులో డీఆర్ఐ అరెస్ట్ చేసిన నిందితుడు బసరత్ ఖాన్ దిగుమతి చేసిన ల్యాండ్ క్రూయిజర్ కారులో ట్విట్టర్ టిల్లు ఎందుకు కనిపిస్తున్నారు? కేసీఆర్ కుటుంబానికి చెందిన కంపెనీల పేర్లతో ఎందుకు రిజిస్టర్ అయ్యాయి? మార్కెట్ ధరను చెల్లించారా? పేమెంట్లు బినామీ పేర్లపై జరిగాయా? నకిలీ ఆదాయమా? లేదంటే మనీ లాండరింగ్ ద్వారానా? నిజాలు బయటకు రావాలి. సంబంధిత శాఖలు దర్యాప్తు చేయాలి’ అనే వాక్యాల సారాంశంతో బండి సంజయ్ చేసిన ట్వీట్ ను దిగువన చూడవచ్చు.


