గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమితులైన ప్రొఫెసర్ కోదండరామ్, అమీర్ ఆలీఖాన్ లకు సుప్రీంకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. ఈ ఇద్దరి నియామకాలపై సంచలన తీర్పును వెలువరిస్తూ బుధవారం స్టే విధించింది. కోదండరామ్, ఆలీఖాన్ ల నియామకాలను నిలిపివేస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.
ఎమ్మెల్సీలుగా కోదండరామ్, అమీర్ ఆలీఖాన్ ల నియామకాలను సవాల్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు దాసోజు శ్రవణ్, సత్యనారాయణలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వీరు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కోదండరామ్, ఆలీఖాన్ ల నియామకాలపై స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులకు అనుగుణంగా ఎంపిక ఉండాలని నిర్దేశిస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టు సవరించింది. మధ్యంతర ఉత్తర్వుల తర్వాత కోదండరామ్, ఆలీఖాన్ లు చేసిన ప్రమాణ స్వీకారాన్ని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా తప్పు పట్టింది.
