బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కానిస్టిట్యూషన్ క్లబ్ పాలక మండలి ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. దేశ రాజధాని న్యూఢిల్లీలోని ప్రతిష్ఠాత్మక ‘కానిస్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియా’ పాలకమండలి ఎన్నికల్లో భాగంగా మంగళవారం పోలింగ్ నిర్వహించారు. పార్లమెంట్ సభ్యులతో పాటు మాజీ ఎంపీలు కూడా ఈ క్లబ్ లో సభ్యులుగా కొనసాగుతారు. ఎంపీ వద్దిరాజు వద్దిరాజు రవిచంద్ర, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీలు బడుగుల లింగయ్య యాదవ్,బాల్క సుమన్ తదితరులతో కలిసి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

