Saturday, January 24, 2026

Top 5 This Week

Related Posts

కస్టమర్లకు ICICI బ్యాంక్ బిగ్ షాక్!

తన ఖాతాదారులకు ఐసీఐసీఐ బ్యాంక్ రాఖీ పండుగ వేళ బిగ్ షాక్ ఇచ్చింది. సేవింగ్స్ అకౌంట్ మినిమమ్ బ్యాలెన్స్ ను రూ. 10 వేల నుంచి రూ. 50 వేలకు పెంచేసింది. మెట్రో నగరాల్లోనేగాక, అర్బన్, సెమీ అర్బన్, రూరల్ బ్రాంచ్ ల ఖాతాదారుల అందరిపైనా ఈ పెంపు ప్రభావం ఉంటుందని ఐసీఐసీఐ బ్యాంక్ స్పష్టం చేసింది. ఈమేరకు బ్యాంక్ శనివారం ఓ సర్క్యులర్ ను జారీ చేసింది.

ఆయా ప్రాంతాల వారీగా గతంలో గల మినిమమ్ బ్యాలెన్స్ ఐదు రెట్లు పెరిగింది. అంటే ఉదాహరణకు గ్రామీణ ప్రాంతాల ఖాతాల్లో గతంలో రూ. 2,500 మినిమమ్ బ్యాలెన్స్ కాగా, తాజా నిబంధనతో రూ. 10 వేలకు పెరిగింది. మిగిలిన ప్రాంతాల ఖాతాలకూ ఇదే ప్రాతిపదిక మినిమమ్ బ్యాలెన్స్ పెరిగింది. ఈ రూల్ ఆగస్టు 1వ తేదీ నుంచే వర్తిస్తుందని కూడా ప్రకటించింది. పొదుపు ఖాతాల్లో మినిమమ్ బ్యాలెన్స్ లేని సందర్భాల్లో ఫైన్ విధింపును కొన్ని బ్యాంకులు ఎత్తివేస్తున్న పరిస్థితుల్లో, ప్రయివేట్ రంగంలో దిగ్గజ బ్యాంకుగా ప్రాచుర్యం పొందిన ఐసీఐసీఐ ఈ నిర్ణయం తీసుకోవడం ఖాతాదారులను విస్మయానికి గురి చేసిందనే వ్యాఖ్యలు ఈ సందర్భంగా వినిపిస్తున్నాయి.

Popular Articles