(By K. Ramachandra Reddy)
కన్నప్ప అను ‘తిన్నడి ప్రేమకథ’ సినిమా నిజ్జంగానే బావుంది.
ఔను సుమా కల కాదు సుమా! ఎందుకంటే…
పురాణ, కావ్య కథగా వున్న కన్నప్ప కథ తెలిసిన తెలివితో(జ్ఞానం) సినిమా చూస్తే అస్సలు నచ్చకపోవచ్చు. కానీ ఇది తిన్నడు అనేవాడి ప్రేమ కథగా ఒక “పక్కా కమర్షియల్” సినిమాగా రెండు ముప్పావు గంటలు, చివరి ఐదు పది నిమిషాలూ ఆ పురాణ, కావ్య కథను పై కథతో మిక్సీ చేసి మొత్తం మీద మెప్పించిన సినిమానే ఇది. కాబట్టి ఏ రకమైన లాజిక్కులు తీయకుండా, ప్రీ ఆక్యుపైడ్ గా కాకుండా సినిమా చూస్తే మూడు గంటలు కూర్చోగలిగిన సినిమానే.
అందులోనూ ఇప్పటి తరానికి నచ్చే అంశాలు అంటే హీరోయిన్ ‘నెమలి’ పాత్రధారిణి ధరించిన అల్ట్రా మోడరన్ ‘బ్రా’లు, బోలెడు ఫైట్లు, హింస ఉన్నాయి కాబట్టి నిలబడిపోతుంది.

ప్లస్ పాయింట్స్-
1. సెకండ్ హాఫ్ లో ‘ప్రభాస్’ ఉన్న పదిహేను నిమిషాలూ సినిమాని బాగా నడిపేస్తుంది. సెకండ్ హాఫ్ లో కథ ఊపందుకుని చివరి అరగంట వేగంగా నడవడం కూడా సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్. ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ బావున్న సినిమానే నిలబడుతుంది కదా. ఆ లెక్కన కన్నప్ప ఒకే.
- ముఖ్యంగా లోకేషన్స్ చాలా బాగున్నాయి. అది న్యూజిలాండ్ అయినా ఎక్కడ అయినా క్రూ చెప్పారు కాబట్టి తెలిసింది కానీ లేకపోతే ఏం లేదు. రాజమౌళి ‘గ్రీన్ మ్యాట్’ మీద మొత్తం సినిమా తీసినా ఒప్పుకునే జనం నిజమైన లోకేషన్స్ (ఎక్కడైనా కానీండి)లోనే కథకు అనుగుణంగా తీసిన ఈ సినిమాని ఎందుకు కాదనడం? శ్రీకాళహస్తి సినిమా అక్కడే తీయాలన్న రూలేం లేదుకదా? సినిమా గ్రామర్ కి అనుగుణంగా ఎక్కడైనా తీయొచ్చు. “పాత కన్నప్ప మూడు సినిమాలు” కూడా అక్కడ తీయలేదు. బాపు సినిమా పూర్తిగా గోదావరి ప్రాంతంలో తీశారు.
ఈ సినిమాను మంచు ఫామిలీ ప్రకటించినప్పటి నుండీ ఈ ఫామెలీ మీద కొన్ని సినిమా వర్గాలకి, అలాగే ఈ ఫామెలీ చాలా విషయాల్లో చేసే అతి వల్ల మామూలు సినిమా ఆడియన్ కి వున్న ‘నెగిటివిటీ’ వల్ల సినిమాకి కొంత మిక్స్ డ్ బజ్ వచ్చినా రిలీజ్ తర్వాత అవేమీ నిలవకుండా సినిమాలో వున్న ప్లస్ పాయింట్స్ తో కొట్టుకుపోయాయి. - పెర్ఫార్మెన్స్ – మంచు విష్ణు సింగిల్ హాన్డెడ్ గా సినిమాని నిలబెట్టాడు. పురాణ కథ కాబట్టి డైలాగ్ డెలివరీ కొంచెం ప్రాక్టీస్ చేసి వుంటే బావుణ్ణు. అయితే ‘తల్లి సెంటిమెంట్ డైలాగ్స్’ ఈ పాత్రకి ప్లస్ పాయింట్స్. ఆ సందర్భాల్లో క్లాప్స్ కూడా పడ్డాయి. అందాల ఆరబోత కోసమే ప్రత్యేకించి హీరోయిన్ పాత్ర కల్పించినందువల్ల తనమేరకు తను బానే చేసింది. కొన్ని సీన్స్ లో నటించింది కూడా. ముఖ్యంగా ‘ప్రభాస్’ రుద్రశివరూపంగా బాగా చేసి, డైలాగ్స్ బాగా పలికాడు. ప్రభాస్ వున్న ఆ పదిహేను నిమిషాలు అతని డైలాగ్స్ ని మంచి సెన్సిటివిటీతో రాశారు.
‘ఏమి సేతురా లింగా’ తత్వ గేయంలో చరణాల సారాన్ని శివ బ్రాహ్మణునికి (మోహన్ బాబు) చెప్పే డైలాగ్స్ తదితరాలు బాగా పేలాయి. రెండు డైలాగ్స్ అతని ఫ్యాన్స్ కోసం కూడా- ‘అందరి కంటే నేనే పెద్దవాణ్ణి (శివుడు అనే అర్థంలో & తన ఫ్యాన్ బేస్లో)’ తిన్నప్ప నీకు పెళ్లయిందా? అన్నపుడు ‘నా పెళ్లి గురించి నీకెందుకు (ఫ్యాన్స్ కి పెద్ద తలపోటుగా మారిన అతని స్వీయ జీవితానికి సంబంధించి)’. అసలు ఈ సినిమాకి పెద్ద క్రౌడ్ & పెద్ద ప్లస్ పాయింట్ ప్రభాస్ ఫ్యాన్స్ నే. ఫస్ట్ హాఫ్ లో ఒకసారి, సెకండ్ హాఫ్ మొదట్లో ఒకసారి ప్రభాస్ వస్తున్నాడనుకున్న సీన్స్ లో వాళ్ళు బాగా ఎక్సైట్ అయ్యారు. కానీ సెకండ్ హాఫ్ లో గంట తర్వాతే ప్రభాస్ వచ్చి వాళ్ళని కేరింతలు కొట్టించాడు. మోహన్ బాబు ఎక్స్‌ట్రాలు చేయకుండా శివబ్రాహ్మడిగా ఓకే అనిపించాడు. శరత్ కుమార్, ముఖేష్ రిషి, మధుబాల, మిగిలిన నటులు ఓకే. - అసలు విషయం ఈ సినిమాలో శివునిగా ముగ్గురు నటించారు. 1. కైలాస శివునిగా, సినిమా కథ మొత్తం పార్వతికి చెప్పే పాత్రలో, అక్షయ్ కుమార్. 2. అర్జునుని పరీక్షించే కిరాతరూపశివునిగా మోహన్ లాల్. 3. రుద్రశివరూపంగా ప్రభాస్.
- స్టోరీ ట్రీట్మెంట్ – కథ పైన చెప్పినట్టు పూర్తిగా కల్పిత కథ కాబట్టి మనం “అసలు కన్నప్ప” కథకి అనుగుణంగా ఏ లాజిక్కులు తీయకుండా చూడాలి. అలా చూసినపుడు స్క్రీన్ ప్లే ఫస్ట్ హాఫ్ అంతా తిన్నడి లవ్ స్టోరీ & వాయులింగం దొంగతనాన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ నడిపేసినా సెకండ్ హాఫ్ ఆ కల్పిత కథని బాగా వేగవంతం చేసి చివరి ఐదు నిమిషాలు శివునికి కన్నులు అప్పగించే సీన్ ‘భక్తి టచ్’ తో ముగించి వ్యూయర్ ని సంతృప్తి పరచడం వల్ల దర్శకుడికి మార్కులు బాగానే వేయచ్చు.
- చివరి ఐదు నిమిషాలలో వచ్చే సాలెపురుగు, పాము, ఏనుగుల ‘సిజీ’ & శివుని కంటినీరు, రక్తం ‘సీజీ’ విజువల్స్ కూడా బావున్నాయి.
మైనస్ పాయింట్స్ –
మ్యూజిక్- పెద్ద మైనస్. ఏ పాట కూడా మళ్ళీ వినాలనుకునేలా లేవు సరికదా, కృతకంగా కూడా వున్నాయి. విజువల్స్ వల్ల కొట్టుకుపోయాయి. ఇంతకుముందు కన్నప్ప సినిమాల్లోని 1. ‘మహేశా పాపవినాశా కైలాసవాసా ఈశా’-కన్నడ రాజ్ కుమార్ , 2. ‘శివశివ శంకరా భక్త వశంకర శంభో హరహర నమో నమో’ (కృ.రాజు) పాటల్లా ఒక్క పాట కూడా కాలానికి నిలిచేది లేదు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఓకే.
రన్ టైం – పది నిమిషాలు తగ్గించొచ్చు. విష్ణు కూతుళ్ల డాన్స్ కోసమే పెట్టిన, సినిమా కథను మొదలు పెట్టే, పాట అనవసరం. అలాగే బ్రహ్మానందం, సప్తగిరి పాత్రల వల్ల కామెడీ ఏమీ పండలేదు. ఆ టైం కూడా తీసేయొచ్చు.
డైలాగ్స్- మోస్ట్ ఆఫ్ డైలాగ్స్ డబ్బింగ్ తెలుగు నుడికారంలో ఉండకుండా కృతకంగా వున్నాయి. ముఖ్యంగా పర భాషా నటుల పాత్రల డైలాగ్స్, అలాగే ‘చిన్న తిన్నడు’ పాత్రలో విష్ణు కొడుకు ఇంగ్లీష్ మీడియం డైలాగ్స్ అసహ్యంగా వున్నాయి. ఇవన్నీ ఎవరిచేతనైనా డబ్బింగ్ చెప్పిస్తే బావుణ్ణు.
సరదాకి- చివరి పది నిమిషాలు మినహా సినిమా మొత్తం విష్ణు పాత్రని(నాస్తికునిగా) ‘రంగనాయకమ్మ’గారు ఆవహించినట్టు బలే వుంటుంది. 😀
మళ్ళీ అంటున్నా…
దయచేసి ‘అసలు కన్నప్ప’ కథను దృష్టిలో పెట్టుకొని ‘మంచు’ల మీద కోపంతో కాకుండా ఒక మామూలు కమర్షియల్ సినిమాగా చూడగలిగితే ‘ఓకే’ అని తప్పకుండా అనిపిస్తుంది.
మొత్తంగా చూస్తే విష్ణు, ప్రభాస్, లోకేషన్స్, కల్పిత కథ ట్రీట్మెంట్ ల ప్లస్ పాయింట్స్ తో 3.25 / 5 రేటింగ్ ఇవ్వచ్చు.
(గమనిక: ఈ సమీక్ష సమీక్షకుని దృష్టి కోణానికి సంబంధించినది మాత్రమే. సమీక్షకుని వ్యక్తిగత అభిప్రాయం కూడా..)
