మావోయిస్టు పార్టీకి చెందిన మోస్ట్ వాంటెడ్ నక్సలైట్ కుంజం హిడ్మాను భద్రతా బలగాలు అరెస్టు చేశారు. ఒడిషాలోని దట్టమైన పెటాగూడ అడవుల్లో హిడ్మాను పోలీసులు అరెస్ట్ చేశారు. హిడ్మా అలియాస్ మోహన్ ఏడు ప్రధాన హింసాత్మక ఘటనల్లలో నిందితుడు. నక్సల్ కార్యకలాపాలకు బలమైన కేంద్రంగా భావిస్తున్న ఒడిషా, ఛత్తీస్ గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దుల్లోని ట్రై జంక్షన్ లో భద్రతా బలగాలు తమ ఆపరేషన్ లో భాగంగా హిడ్మాను అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఒడిషాలోని కోరాపుట్ జిల్లా పోలీసులు, డీవీఎఫ్ దళాలు జాయింట్ ఆపరేషన్ ద్వారా హిడ్మాను అదుపులోకి తీసుకున్నాయి. హిడ్మా అరెస్ట్ ఘటన తీవ్ర సంచలనాత్మక ఘటనగా భావింవచ్చు. కాగా అందరూ భావిస్తున్నట్లుగా పోలీసులు అరెస్ట్ చేసింది మడివి హిడ్మా కాకపోవడం గమనార్హం. పోలీసులు ఎన్నాళ్లుగానో తీవ్రంగా గాలిస్తున్న కరడుగట్టిన నక్సల్ లీడర్ హిడ్మా పేరుతో పలువురు మావోయిస్టు పార్టీలో ఉన్నట్లు తెలుస్తోంది.

