మరోసారి కరోనా వైరస్ బెల్స్ మోగుతున్నాయి. దేశవ్యాప్తంగా నమోదైన కరోనా క్రియాశీల కేసుల సంఖ్య 1,009కి చేరగా, వారం వ్యవధిలోనే 750 మందికి కొత్తగా కోవిడ్ సోకినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా కోనా వైరస్ కలకలం సృష్టిస్తుండడం గమనార్హం.
దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం 104 మంది కరోనా వైరస్ తో బాధపడుతున్నట్లు వార్తలందుతున్నాయి. కేరళలో కరోనా బాధితుల సంఖ్య తాజాగా 430 సంఖ్యను దాటినట్లు సమాచారం. అదేవిధంగా మహారాష్ట్రలో 209, గుజరాత్ లో 83, కర్నాటకలో 47, ఉత్తరప్రదేశ్ లో 15, వెస్ట్ బెంగాల్ లో 12 కేసుల చొప్పున నమోదైనట్లు జాతీయ మీడియా నివేదిస్తోంది. కరోనా వ్యాప్తి చెందుతున్న తీరును ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిశితంగా గమనిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.
