Monday, September 1, 2025

Top 5 This Week

Related Posts

Update: పవన్ కళ్యాణ్ భద్రాచలం పర్యటన రద్దు

జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శనివారం ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యటనకు రానున్నారు. భద్రాచలంలో జరిగే శ్రీరామ నవమి వేడుకల్లో పాల్గొనేందుకు ఓరోజు ముందుగానే ఆయన ఖమ్మం జిల్లాకు చేరుకోనున్నారు. భద్రాద్రి రామయ్య కళ్యాణానికి ఏపీ ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు సమర్పించేందుకు ఆయన ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యటనకు వస్తున్నారు. ఈమేరకు టూర్ షెడ్యూల్ ఖరారైనట్లు అధికారిక సమాచారం వెలువడింది.

ఈ పగలు 12 గంటలకు హైదరాబాద్ లోని మాదాపూర్ నుంచి రోడ్డు మార్గాన పవన్ కళ్యాణ్ ఖమ్మం జిల్లాకు బయలుదేరుతారు. సాయంత్రం ఐదు గంటలకు భద్రాచలం చేరుకుంటారు. ఆదివారం జరిగే రాములవారి కళ్యాణంలో పాల్గొని స్వామివారికి ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారు. అనంతరం అదేరోజు సాయంత్రం ఐదు గంటలకు భద్రాచలం నుంచి బయలుదేరి రాత్రి పది గంటలకు తిరిగి మాదాపూర్ చేరుకుంటారని అధికారిక టూర్ షెడ్యుల్ ప్రకటన వెలువడింది.

పవన్ పర్యటన సందర్భంగా ఆయనకు జెడ్ కేటగిరీ భద్రతతోపాటు బుల్లెట్ ప్రూఫ్ కారును సమకూర్చాల్సిందిగా ఖమ్మం, భద్రాద్రి జిల్లాల అధికార యంత్రాంగానికి ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి.

Popular Articles