తెలంగాణా పోలీసు శాఖలో విషాదం అలుముకుంది. ఈ తెల్లవారు జామున హైదరాబాద్ హయత్ నగర్ లోని లక్ష్మారెడ్డిపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో అదనపు డీసీపీ బాబ్జి దుర్మరణం చెందారు. వివరాలు ఇలా ఉన్నాయి.
లక్ష్మారెడ్డి పాలెంలోని మైత్రి కుటీర్ లో నివాసముంటున్న బాబ్జీ మార్నింగ్ వాక్ కు వెళ్లారు. విజయవాడ హైవేను దాటుతుండగా ఏపీఎస్ ఆర్టీసీకి చెందిన బస్సు బాబ్జీని ఢీకొంది. తీవ్రంగా గాయపడిన బాబ్జీ ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

