Saturday, January 24, 2026

Top 5 This Week

Related Posts

రూ. 89.43 లక్షల విలువైన గంజాయి పట్టివేత

అక్రమంగా రవాణా చేస్తున్న రూ. 89.43 లక్షల విలువైన 178.870 కిలోల గంజాయిని ఖమ్మం జిల్లా పోలీసులు పట్టుకున్నారు. గత రాత్రి ఏడున్నర గంటల ప్రాంతంలో కూసుమంచి పోలీసులు చేగొమ్మ క్రాస్ రోడ్డు వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా ఈ గంజాయి పట్టుబడింది. కూసుమంచి నుంచి వయా ఖమ్మం మరిపెడ బంగ్లా మీదుగా పూణేకు వెడుతున్న TS10 EJ7860 అనే నెంబర్ గల కారు అనుమానాస్పదంగా కనిపించింది. పోలీసులు కారును తనిఖీ చేయా ఎనిమిది బస్తాల్లోనేగాక 90 ప్యాకెట్ల గంజాయి కారులో ఉండగా పోలీసులు పట్టుకున్నారు.

కారులో గల నిందితులు పల్లపు రఘు, మహ్మద్ ఖాజాపాషా అనే వ్యక్తులు ట్రావెల్స్ నడుపుతూ కార్ల ద్వారా ఒడిషాలోని బాబు, సుబ్బు, రామాంజనేయులు అనే వ్యక్తుల నుంచి గంజాయిని తక్కువ ధరకు కొనుగోలు చేసి పూణేలోని సోహైల్ అనే అతనికి ఎక్కువ ధరకు విక్రయిస్తూ వ్యాపారంగా చేసుకున్నట్లు కూసుమంచి పోలీసులు వెల్లడించారు. పట్టుబడిన నిందితుల్లో రఘు బోడుప్పల్, ఖాజాపాషా మిర్యాలగూడ మండలం వెంకటాద్రి పాలేనికి చెందిన వ్యక్తలుగా పోలీసులు ప్రకటించారు.

కారు సహా నిందితుల నుంచి 178.87 కిలోల గంజాయి, 41 గ్రాముల బంగారు వస్తువులు, 9,000 నగదు, మూడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు కూసుమంచి పోలీసులు ప్రకటించారు.

Popular Articles