Saturday, January 24, 2026

Top 5 This Week

Related Posts

భూపాలపల్లి హత్య కేసులో పోలీసుల నిర్లక్ష్యం! కేసు నిలబడుతుందా!?

అనేక విషయాల్లో తెలంగాణా పోలీసులకు మంచి పేరుంది. జాతీయ స్థాయిలోనూ ఖ్యాతి గడించిన ఘటనలు అనేకం. తీవ్రవాద సంస్థలను అదుపులో ఉంచడంలో, నేర నియంత్రణలో, చోరీ ఉదంతాల్లో గంటల్లోనే నిందితులను పట్టుకోవడంలో తెలంగాణా పోలీసులకు ప్రత్యేక పేరుంది. అవార్డులు, రివార్డులు అందుకున్న చరిత్ర ఉంది. అయితే కొన్ని కీలక ఘటనల్లో మాత్రం పోలీసులు బ్లండర్ మిస్టేక్ చేస్తుంటారు. ఫలితంగా కోర్టులో ఆ కేసు నిలబడుతుందో లేదో తెలియని అమోమయ స్థితికి కారకులవుతుంటారు. ఫలితంగా కీలక కేసుల విచారణ సమయంలో కోర్టులో ఎదురయ్యే ప్రశ్నలకు సంబంధిత స్టేషన్ల పోలీసులు నీళ్లు నములుతుంటారు. భూపాలపల్లిలో జరిగిన రాజలింగం అనే వ్యక్తి హత్యోదంతంలోనూ పోలీసులు ఇటువంటి నిర్లక్ష్య తప్పిదానికే పాల్పడినట్లు స్పష్టమవుతోంది.

హత్యకు గురైన రాజలింగ మూర్తి (ఫైల్)

ఇక్కడ గల ఫిర్యాదు కాపీలో బ్లూ కలర్ లో సర్కిల్ గీత గిసిన తేదీలను నిశితంగా గమనించండి. ఈనెల 19వ తేదీన రాత్రి 7 గంటల ప్రాంతంలో రాజలింగం హత్య జరిగింది. మరుసటి రోజు రాత్రి 10 గంటల ప్రాంతలో పోలీసులకు ఫిర్యాదు అందినట్లు ఇందులో ఉంది. కానీ జనవరి 19వ తేదీన హత్య జరగ్గా, జనవరి 20వ తేదీన ఫిర్యాదు చేసినట్లు హతుని భార్య సరళ పేర్కొన్నారు. కుటుంబ యజమాని దారుణ హత్యకు గురైన పరిస్థితుల్లో బాధితురాలు పొరపాటున ఇలా తేదీలను రాశారని కాసేపు భావించినప్పటికీ, పోలీసులు కూడా ఏం చేశారో కంప్లయింట్ కాపీలో గమనించండి.

జనవరి 20వ తేదీన 022 గంటలకు అంటే రాత్రి 10 గంటలకు ఫిర్యాదును స్వీకరించినట్లు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదులో పోలీసులు స్పష్టంగా రాశారు. ఇక్కడ కూడా పోలీసులు బాధితురాలు ఫిర్యాదు ప్రతిని బట్టే తేదీని రాశారనే అనుకుందాం. కానీ ఫిర్యాదును స్వీకరించిన అధికారి తన సంతకం కింద కూడా జనవరి 20వ తేదీగా రాయడం గమనార్హం. విషయం అర్థమైంది కదా? జనవరి 20వ తేదీన హత్య జరిగితే ఫిబ్రవరిలో కేసు ఎందుకు నమోదు చేశారని విచారణ సందర్భంగా కోర్టులో ప్రశ్నిస్తే పోలీసులు ఏం చెబుతారనేది సందేహాస్పదాంశం. రాష్ట్ర వ్యాప్తంగా కాస్త రాజకీయ రంగును కూడా పులుముకున్న రాజలింగమూర్తి హత్య కేసులో పోలీసుల ఇటువంటి నిర్లక్ష్యం వల్ల అసలు కేసు నిలబడుతుందా? లేదా? చూడాలి మరి..

Popular Articles