Monday, September 1, 2025

Top 5 This Week

Related Posts

నక్సల్స్ కదలికలపై సిరిసిల్ల ఎస్పీ స్పందన

రాజన్న సిరిసిల్ల జిల్లాలో జనశక్తి నక్సల్స్ కదలికలపై ఆ జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే స్పందించారు. జిల్లాలో జనశక్తి నక్సలైట్స్ ఆయుధాలతో సమావేశం పెట్టారనే వార్త కొన్ని న్యూస్ ఛానెల్స్, మెసేజులు, సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నాయని చెప్పారు. అయితే ఇందులో ఎలాంటి వాస్తవం లేదని, అలాంటి సమావేశాలు జిల్లాలో జరగలేదని ఎస్పీ రాహుల్ హెగ్డే సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

జిల్లాలో జనశక్తి నక్సలైట్ల మూమెంట్ లేదని, ప్రజలు ఎవరు కూడ భయపడవద్దని అన్నారు. నక్సల్స్ కదలికల సమాచారం ఉంటే దగ్గరలో గల పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇవ్వాలని సూచించారు. జనశక్తి పేరు మీద ఎవరన్నా ఫోన్ కాల్ చేసి బెదిరిస్తే సమాచారం అందివ్వాలని, వారి మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ పేర్కొన్నారు..

Popular Articles