Sunday, August 31, 2025

Top 5 This Week

Related Posts

ఇదేం ‘పాదపూజ’ రాజేంద్రా!?

మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటెల రాజేందర్ ‘పాదపూజ’ చేయించుకుంటున్న వీడియో వివాదాస్పదంగా మారింది. ‘ఆత్మగౌరవం’ నినాదాన్ని ప్రవచించిన ఈటెల రాజేందర్ అభిమానుల పేరుతో తన పాదాలకు పాలాభిషేకం చేయించుకున్నారనే అభిప్రాయాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు.

హుజూరాబాద్ ఉప ఎన్నికలకోసం సన్నద్ధమవుతూ ఈటెల రాజేందర్ పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా 11వ రోజున గురువారం ‘పాదపూజ’ దృశ్యం చోటుచేసుకోవడం గమనార్హం. జమ్మికుంట మండలం విలాసాగర్ గ్రామంలో ఈటెల పాదయాత్ర చేస్తున్న సందర్భంగా కొందరితో ఆయన తన పాదాలకు పాలాభిషఏకం చేయించుకున్న వీడియో కలకలం కలిగిస్తోంది.

అయితే ఈటెల రాజేందర్ రాజీనామా వల్లే తమ నియోజకవర్గం అభివృద్ధికి సీఎం నిధులు మంజూరు చేస్తున్నారని, ఇందుకు కారణమైన ‘ఈటెల’ పాదాలను కడిగి మరీ తమ అభిమానాన్ని చాటుకున్నారనేది బీజేపీ కార్యకర్తల అభిప్రాయం. ‘మహారాజా’ కుర్చీలో కూర్చున్న ఈటెల రాజేందర్ పాదాలకు కొందరు పాలాభిషేకం చేస్తున్న వీడియోను దిగువన చూడవచ్చు.

Popular Articles