Saturday, January 24, 2026

Top 5 This Week

Related Posts

అమరవీరులకు సీఎం కేసీఆర్ నివాళి

ప్రత్యేక తెలంగాణా సాధనలో అమరులైన వీరులకు ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా హైదరాబాద్​లోని గన్​పార్క్​ వద్ద అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్చం ఉంచి కేసీఆర్ నివాళులు అర్పించారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సమప్రాధాన్యంతో, బంగారు తెలంగాణా సాధన దిశగా రాష్ట్రం దూసుకెళ్తోందని రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందేశంలో సీఎం​ తెలిపారు. అన్ని వర్గాలకోసం అవసరమైన కార్యక్రమాలు, వినూత్న విధానాలతో చిరుప్రాయంలోనే ఘనవిజయాలతో తనదైన ముద్ర వేసిన తెలంగానా చాలా రంగాల్లో, అంశాల్లో దేశానికి, ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచినట్లు చెప్పారు. సంక్షేమం, వ్యవసాయం, సాగునీరు, విద్యుత్ తదితర రంగాల్లో ప్రభుత్వ చర్యలు గుణాత్మక మార్పుకు దోహదపడ్డాయని, అవి అద్భుత ఫలితాలను ఇస్తున్నాయన్నారు. పారిశ్రామికరంగంలోనూ దూసుకెళ్తూ ఐటీలో అద్భుత పురోగతి సాధిస్తోందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

Popular Articles