Monday, September 1, 2025

Top 5 This Week

Related Posts

మేడారం మినీ జాతర తేదీలు ఖరారు

మేడారం మినీ జాతర తేదీలు ఖరారయ్యాయి. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో వచ్చే నెలలో జరిగే సమ్మక్క-సారలమ్మ వన దేవతల మినీ జాతర (మండ మెలిగే పండుగ) నిర్వాహణ తేదీలను పూజారులు వెల్లడించారు.

ఫిబ్రవరి 24 నుంచి 27 వరకు మినీ జాతర జరగనుంది.

ఫిబ్రవరి 24వ తేదీ బుధవారం గుడిశుద్ధి, పూజాకార్యక్రమాలు, ఇదేరోజు ఉదయం గ్రామ నిర్భంధన.

25వ తేదీ గురువారం సమ్మక్క, సారలమ్మలకు పసుపు, కుంకుమలతో అర్చన.

26వ తేదీ శుక్రవారం అమ్మవార్లను భక్తులు దర్శించుకొనుట.

27వ తేదీ శనివారం అమ్మవార్ల పూజ కార్యక్రమాల నిర్వహణతో మినీ మేడారం జాతర ముగుస్తుంది.

Popular Articles