Saturday, January 24, 2026

Top 5 This Week

Related Posts

‘తుఫాన్’పై మంత్రి హెచ్చరిక

మ‌‌రోసారి తుఫాన్ హెచ్చ‌రిక నేప‌థ్యంలో అధికారుల‌తోపాటు, ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, త‌గిన ముందు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు పిలుపునిచ్చారు.

ఈ ఏడాది విస్తృతంగా వ‌ర్షాలు ప‌డుతున్నాయ‌ని, అందులో తుఫాన్లు కూడా వ‌స్తున్నాయ‌న్నారు.ఈ తుఫాన్ల కార‌ణంగా గ‌త అనుభ‌వాల‌ను దృష్టిలో పెట్టుకుని, అటు అధికారులు, ఇటు ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌న్నారు. లోత‌ట్టు ప్రాంతాల ప్ర‌జ‌లు వ‌ర్ష సూచ‌న‌ల‌ను బ‌ట్టి సుర‌క్షిత ప్రాంతాల‌కు వెళ్ళాల‌న్నారు.

పిడుగుల ప‌డే ప్ర‌మాదాలున్నందున వ్య‌వ‌సాయ‌దారులు, చేప‌లు ప‌ట్టే వారు కూడా వాతావ‌ర‌ణాన్ని బ‌ట్టి బ‌య‌ట‌కు వెళ్ళాల‌న్నారు. ఈ అంశాల‌ను దృష్టిలో పెట్టుకుని, అధికారులు త‌గు జాగ్ర‌త్త‌ల‌తో ఉండాల‌ని మంత్రి ఆదేశించారు.

Popular Articles