Saturday, January 24, 2026

Top 5 This Week

Related Posts

భయపడినట్లు కాదు! కానీ… క్షమించండి!!

జగన్ కాదు కదా… ఆయన ప్రభుత్వం కూడా తననేమీ చేయలేదని అనకాపల్లి మాజీ ఎంపీ, తెలుగుదేశం పార్టీ నేత సబ్బం హరి నిన్న గాక మొన్న బీరాలు పలికిన సంగతి తెలిసిందే కదా? వాస్తవానికి ఈ వ్యాఖ్యల్లో సబ్బం హరి వాడిన ‘భాషా సౌందర్యం’ వేరు. కానీ సబ్బం హరి గురించి నిన్న ‘సాక్షి’ కథనం వాడిన ‘భాష’ తరహాలో మనం కూడా అదే భాషను వాడలేం కాబట్టి, పత్రికా భాషకు కట్టుబడి మరీ విషయాన్ని గుర్తు చేసుకుంటున్నాం. ఇక అసలు విషయంలోకి వెడితే…

ఏపీ సీఎం జగన్ గురించి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి గురించి తాను వాడిన భాష, చేసిన వ్యాఖ్యలపై సబ్బం హరి అభిమానులే నొచ్చుకున్నారట. ప్రశ్నించారట. అందుకే తాను వారిని క్షమాపణ కోరుతున్నానని సబ్బం హరి అంటున్నారు. అలాగే ముఖ్యమంత్రి అభిమానులను కూడా సబ్బం హరి కోరుకున్నారు. క్షమించాలని కోరినంత మాత్రాన తాను భయపడినట్లు కాదని కూడా చెబుతున్నారు. సరే… ఆయన భయపడ్డారా? లేదా అనేది అప్రస్తుతం. ఈ వివాదంలో తాజాగా, అంతకు ముందు సబ్బం హరి ఏమన్నారో దిగువన గల వీడియో లింకుల్లో ఓసారి చూసేయండి.

https://www.youtube.com/watch?v=ZU0eYVcpptk&feature=emb_title
https://www.youtube.com/watch?v=sWpU9-LgAfc

Popular Articles