Sunday, January 25, 2026

Top 5 This Week

Related Posts

ఎన్కౌంటర్: నలుగురు నక్సల్స్ మృతి

తెలంగాణా సరిహద్దుల్లో గల ఛత్తీస్ గఢ్ లోని సుక్మా జిల్లా జేగురుగొండ అడవుల్లో పోలీసులతో జరిగిన ఎదురు కాల్పుల ఘటనలో నలుగురు మావోయిస్టు నక్సలైట్లు మరణించారు. కొద్ది సేపటి క్రితం జరిగిన ఈ ఘటనను సుక్మా ఎస్పీ శలబ్ సిన్హా ధృవీకరించారు.

కోబ్రా, సీఆర్పీఎఫ్, డీఆర్జీ విభాగాలకు చెందిన పోలీసు బలగాలు సుక్మా జిల్లా జేగురుగొండ అడవుల్లో నక్సల్స్ గాలింపు చర్యల్లో భాగంగా జాయింట్ ఆపరేషన్ నిర్వహించేందుకు బయలుదేరారు. ఈ సందర్భంగా తారసపడిన మావోయిస్టులతో పోలీసు బలగాలు తలపడ్డాయి.

ఇరువర్గాల మధ్య పరస్పరం జరిగిన హోరాహోరీ కాల్పుల్లో నలుగురు మావోయిస్టు నక్సలైట్లు మరణించారు. ఘటనా స్థలంలో నాలుగు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు సుక్మా పోలీసులు మీడియాకు చెప్పారు.

Popular Articles