Top 5 This Week

Related Posts

కరోనాతో సీఐ మృతి

కరోనా మహమ్మారి ఓ పోలీసు అధికారిని పొట్టనబెట్టుకుంది. ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం ట్రాఫిక్ సీఐగా పనిచేస్తున్న రాజశేఖర్ కరోనా సోకి మరణించారు. కరోనా బారిన పడిన రాజశేఖర్ స్థానికంగా ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే మంగళవారం తుదిశ్వాస విడిచారు. కరోనా మహమ్మారి తన సమకాలికుడైన సీఐ రాజశేఖర్ ను బలి తీసుకోవడంపై హిందూపురం పార్లమెంట్ సభ్యుడు గోరంట్ల మాధవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాజశేఖర్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, అన్ని విధాలుగా ఆదుకుంటుందని మాధవ్ హామీ ఇచ్చారు.

Popular Articles