ఛత్తీస్ గఢ్: మావోయిస్ట్ పార్టీకి చెందిన 71 మంది నక్సలైట్లు దంతెవాడ జిల్లా ఎస్పీ గౌరవ్ రాయ్ ముందు బుధవారం లొంగిపోయారు. వీరిలో 50 మంది పురుషులు కాగా, 21 మంది మహిళలు ఉన్నారు. లొంగిపోయిన మొత్తం నక్సల్స్ లో 30 మందిపై రూ. 64 లక్షల నగదు రివార్డు ఉన్నట్లు దంతెవాడ పోలీసులు ప్రకటించారు. తాజా పరిస్థితిపై బస్తర్ ఐజీ పి. సుందర్ రాజ్ మాట్లాడుతూ, నక్సలైట్లకు లొంగిపోవడం మినహా మరో మార్గం లేదని స్పష్టం చేశారు. నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్లను ముమ్మరం చేయడం, ప్రభుత్వ పునరావాస చర్యల విధానాలతో ఛత్తీస్ గఢ్ లో నక్సలిజం తగ్గిపోతున్నట్లు ఆయన చెప్పారు.


