హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా 47 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ తెలంగాణా ప్రభుత్వం బుధవారం ఉత్తర్వు జారీ చేసింది. పోస్టింగులు కల్పించిన అధికారులు వెంటనే తమకు కేటాయించిన ప్రదేశాల్లో రిపోర్ట్ చేయాలని, లేనిపక్షంలో క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని ఎండార్స్ మెంట్ ఉత్తర్వులో మున్సిపల్ జాయింట్ డైరెక్టర్ కె. నారాయణరావు స్పష్టం చేశారు. నేడో, రేపో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుందని భావిస్తున్న నేపథ్యంలో ఈ బదిలీ ఉత్తర్వు వెలువడడం గమనార్హం.
మున్సిపాలిటీలవారీగా పోస్టింగులు అందుకున్న కమిషనర్ల ఉత్తర్వును దిగువన గల పీడీఎఫ్ పైల్ లో తెలుసుకోవచ్చు. వరుసగా మూడు పేజీలు ‘ఎండార్స్ మెంట్’ ఉత్తర్వు కాగా, ఆ తర్వాత పేజీల్లో ప్రస్తుతం పనిచేస్తున్న, బదిలీ స్థానం వివరాలు ఉన్నాయి.

