హైదరాబాద్: తెలంగాణాలో భారీ సంఖ్యలో ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. బదిలీకి గురైన ఐఏఎస్ అధికారుల్లో సీఎంవోలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న జయేష్ రంజన్ కూడా ఉన్నారు. ఆయనను హెచ్ఎండీఏ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ప్రభుత్వం నియమించింది. అదేవిధంగా హైదరాబాద్ మహానగరంలో పాత, కొత్తల జోన్లకు కమిషనర్లను నియమించింది.
గురువారం పొద్దుపోయాక విడుదలైన ఈ ఉత్తర్వులో స్థానచలనం చెందిన ఐఏఎస్ అధికారులు ఎవరు ఎక్కడి నుంచి ఎక్కడికి బదిలీ అయ్యారనే పూర్తి వివరాలను దిగువన గల పీడీఎఫ్ ఫైల్ లో చూడవచ్చు.

