పనాజీ: ఉత్తర గోవాలో ఘోరం జరిగింది. గత అర్ధరాత్రి సిలిండర్ పేలిన ఘటనలో 23 మంది దుర్మరణం చెందారు. గోవా రాజధాని పనాజీకి 25 కి.మీ. దూరంలో గల ఉత్తర గోవాలోని అర్పోరా గ్రామంలో గల ‘బర్చ్ బై రోమియే లేన్’ అనే నైట్ క్లబ్ లో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో ముగ్గురు సజీవ దహనం కాగా, మరో 20 మంది ఊపిరాడక ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు వెల్లడించారు. మృతి చెందిన వారిలో ముగ్గురు మహిళలు ఉండగా, వీరు కిచెన్ సిబ్బందిగా గుర్తించారు. చనిపోయినవారిలో నలుగురైదుగురు వరకు పర్యాటకులు ఉన్నట్లు ప్రభుత్వ అధికార వర్గాలు చెబుతున్నాయి. ప్రమాద ఘటనపై గోవా సీఎం ప్రమోద్ కుమార్ సావంత్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఘటనకు దారి తీసిన లోతైన దర్యాప్తు జరిపి, భద్రతా ప్రమాణాలు పాటించనట్లు తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.


