రాష్ట్ర వ్యాప్తంగా 21 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ తెలంగాణా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పలువురు అధికారులను కీలక స్థానాల నుంచి ప్రాధాన్యత లేని విభాగాలకు, పోస్టింగుల కోసం ఎదురు చూస్తున్న మరికొందరు అధికారులకు పోస్టింగులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇంత పెద్ద సంఖ్యలో పోలీసు అధికారుల, ముఖ్యంగా ఐపీఎస్ అధికారుల బదిలీ జరగడం ఇది రోండోసారి. గత జూన్ లో 24 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ ఉత్తర్వు వెలువడిన సంగతి తెలిసిందే.
ఈ బదిలీల్లో అనేక మంది యువ ఐపీఎస్ అధికారులకు కీలక స్థానాలను అప్పగించారు. వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ను రామగుండ సీపీగా నియమించారు. ఇక్క సన్ ప్రీత్ సింగ్ ను సీపీగా నియమించారు. అదేవిధంగా ఇంచార్జి పాలనలో గల నిజామాబాద్ కు పోలీస్ కమిషనర్ ను నియమించారు. హోంశాఖ అదేశంతో కరీంనగర్ సీపీ అభిషేక్ మహంతి ఏపీ కేడర్ కు వెళ్లగా, ఇక్కడ గౌస్ ఆలంను సీపీగా నియమించారు. నిజామాబాద్ సీపీ కల్మేశ్వర్ సింగ్ సెంట్రల్ సర్వీసుకు వెళ్లిన నేపథ్యంలో సాయిచైతన్యను ఇక్కడ సీపీగా నియమించారు. ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వు ప్రతిని దిగువన చూడవచ్చు.

