హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా 16 మంది అదనపు కలెక్టర్లను, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లను, డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ తెలంగాణా ప్రభుత్వం గత రాత్రి ఉత్తర్వు జారీ చేసింది. పరిపాలనా సౌలభ్యంలో భాగంగా వీరిని బదిలీ చేస్తున్నట్లు ప్రభుత్వ కార్యదర్శి డీఎస్ లోకేష్ కుమార్ తన ఉత్తర్వులో పేర్కొన్నారు. స్థానం చలనం చెందిన అధికారుల వివరాలు:
- వెయిటింగ్ లో గల అదనపు కలెక్టర్ జి. పద్మజారాణికి జోగులాంబ గద్వాల జిల్లా డీఆర్వోగా పోస్టింగ్ ఇచ్చారు.
- మేడ్చల్ డీఆర్వో జేఎల్బీ హరిప్రియను మహబూబ్ నగర్ అదనపు కలెక్టర్ గా నియమించారు.
- శేరిలింగంపల్లి డిప్యూటీ కలెక్టర్ కె. వెంకారెడ్డిని యాదాద్రి భువనగిరి జిల్లా అదనపు కలెక్టర్ గా నియమించారు.
- మెదక్ డీఆర్వో డి. భుజంగరావును ఆదిలాబాద్ అదనపు కలెక్టర్ గా పోస్టింగ్ ఇచ్చారు.
- సీసీఎల్ఏలో అసిస్టెంట్ సెక్రటరిగా పనిచేస్తున్న వి. లచ్చిరెడ్డిని సికింద్రాబాద్ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ గా, ఎస్టేట్ అధికారిగా బదిలీ చేశారు.
- గద్వాల హౌజింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న టి. శ్రీనివాసరావును ఇదే పట్టణంలో ఆర్డీవోగా బదిలీ చేశారు.
- గద్వాల ఆర్డీవో ఎల్. అలివేలును ఇక్కడే హౌజింగ్ పీడీగా బదిలీ చేశారు.
- సీసీఎల్ఏలో అసిస్టెంట్ కలెక్టర్ గా పనిచేస్తున్న పి. రామక్రిష్ణను నర్సాపూర్ ఆర్డీవోగా బదిలీ చేశారు.
- ఇక ఎల్లారెడ్డి ఆర్డీవో కె. పార్థసింహారెడ్డిని చేవెళ్లకు, నర్సాపూర్ ఆర్డీవో కె. మహిపాల్ రెడ్డిని శేరిలింగంపల్లి డిప్యూటీ కలెక్టర్ గా, మెట్ పల్లి ఆర్డీవో ఎన్. శ్రీనివాస్ ను ఖమ్మం ఆర్డీవోగా, ఇక్కడ పనిచేస్తున్న జి. నరసింహారావును మెట్ పల్లికి బదిలీ చేశారు.
- పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న పి. మాధవీ దేవిని నల్లగొండ స్పెషల్ కలెక్టర్ పీఏగా, రొడ్డ ప్రభాకర్ కు డిప్యూటీ కలెక్టర్ గా పదోన్నది కల్పిస్తూ ఎల్లారెడ్డి ఆర్డీవోగా నియమించారు.
- ఎడ్ల రవీందర్ రెడ్డికి కూడా డిప్యూటీ కలెక్టర్ గా పదోన్నతి కల్పిస్తూ ‘కుడా’ భూసేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గా నియమించారు.
- సికింద్రాబాద్ ఎస్టేట్ అధికారిగా పనిచేస్తున్న వి. అరుణను ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాలని ఉత్తర్వులో ఆదేశించారు.

