Saturday, January 24, 2026

Top 5 This Week

Related Posts

పుణెలో ఘోర ప్రమాదం: 15 మంది దుర్మరణం

మహారాష్ట్రలోని పుణెలో గల ఓ కెమికల్ ఫ్యాక్టరీలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. శానిటైజర్లు తయారు చేసే కెమికల్ ఫ్యాక్టరీలో చెలరేగిన మంటల కారణంగా 15 మంది కార్మికులు దుర్మరణం చెందారు. మరో 20 మంది కార్మికులను అగ్నిమాపక సహాయ సిబ్బంది రక్షించారు. ఈ ఘటన జరిగిన సమయంలో కెమికల్ ఫ్యాక్టరీలో దాదాపు 40 మంది కార్మికులు ఉన్నట్లు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. పూర్తి వివరాలు అందాల్సి ఉంది.

Popular Articles